సిరిసిల్లా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్ల పర్యటనను అడ్డుకుంటామన్న టీఆర్‌ఎస్‌పై ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటనను అడ్డుకుంటామన్న కేటీఆర్‌పై కేసులు పెట్టాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని టీఆర్అఎస్ మళ్లీ భయాందోళనకు గురిచేస్తోందని జగ్గారెడ్డి అన్నారు. అంతేకాక 'సిరిసిల్ల ఏమైనా కేటీఆర్ జాగీరా?', 'రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న కేటీఆర్...ఖబడ్దార్!' అని జగ్గారెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయంగా టీఆర్‌ఎస్ బతుకుతోందని తీవ్రమైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ అర్ధంలేని చర్యలవల్లే తెలంగాణ మరింత వెనకబడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ఆర్మూర్ దీక్షకు అభ్యంతరం చెప్పని టీఆర్‌ఎస్.. ఇప్పుడు సిరిసిల్ల బంద్‌కు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

No comments:
Post a Comment