కృష్ణాజిల్లా, జులై 22 : వచ్చే సాధారణ ఎన్నికల్లో (2014) వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. ఆదివారం జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 2014 ఎన్నికలలో జగన్ పార్టీ తరఫునే పోటీ చేస్తానని చెప్పారు. ఇటీవల నానిని టిడిపి బహిష్కరించిన విషయం తెలిసిందే.
బహిష్కరణకు గురైన అనంతరం నాని బహిరంగంగా తన నిర్ణయాన్ని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తాను పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు విశ్వసించడం లేదని విమర్శలు గుప్పించారు. వచ్చే సాధారణ ఎన్నికలలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు తాను రూ.250 కోట్లతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పుట్టిన ప్రదేశం రుణం తీర్చుకోవడానికి తల్లి వంటి తెలుగుదేశం పార్టీని వీడినట్లు చెప్పారు

No comments:
Post a Comment