ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయకేతనం ఎగురవేశాడు. విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను ప్రణబ్ దాటారు. అంతేకాక ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి సంగ్మాపై ప్రణబ్ భారీ మెజార్టీని సాధించేందుకు ప్రణబ్ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే 5.26 లక్షల ఓట్లవిలువతో మ్యాజిక్ మార్కు దాటిన ప్రణబ్..7 లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఓట్ల లెక్కింపు:
రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన 748 ఎంపీల ఓట్లలో ప్రణబ్ ముఖర్జీకి 527 ఓట్లు లభించాయి. ఎన్డీఏ బలపరిచిన పీఏ సంగ్మాకు 296 ఓట్లు పోలయ్యాయి. 15 ఓట్లను చెల్లనవిగా అధికారులు ప్రకటించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీకి జీత భత్యాల కింద లక్షా యాభై వేల రూపాయలు లభించనున్నాయి. అంతేకాక రాష్ట్రపతి భవన్ లోనే కాక.. హైదరాబాద్, షిమ్లాలోని అతిధ్య గృహాలలో నివసించే అవకాశం లభించనుంది. ఇప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ ప్రయాణించే ప్రణబ్ రాష్ట్రపతి హోదాలో బుల్లెట్ ఫ్రూఫ్ మెర్సిడెజ్ బెంజ్ కారులో ప్రయాణిస్తారు. రాష్ట్రపతి భవన్ లో సుమారు 200 మంది సిబ్బంది ప్రణబ్ కు సేవలందిస్తారు.
రిటైర్ మెంట్ తర్వాత నెలకు 75 వేల రూపాయల ఫించన్ తోపాటు, ఉచిత బంగ్లా (టైప్ VIII), రెండు ల్యాండ్ లైన్, ఓ మోబైల్ ఫోన్, ఐదుగురు సిబ్బందితోపాటు, ఓ ప్రైవేట్ సెక్రెటరీ, అధికారికంగా కారును, జీవిత భాగస్వామితో ఉచితంగా ట్రైన్, విమానం ద్వారా ప్రయాణించే వసతులను కల్పిస్తారు. సిబ్బంది జీత భత్యాల కింద 60 వేల రూపాయలను ఇస్తారు.

No comments:
Post a Comment