YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 22 July 2012

ధర్నాకు ఆటంకాలు వద్దు:వైఎస్ఆర్

చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఈ నెల 23న చేయబోయే సిరిసిల్ల ధర్నాకు ఆటంకాలు సృష్టించవద్దని ఆ పార్టీ విజ్జప్తి చేస్తోంది. నేతన్నకు అండగా నిలిచి ప్రభుత్వంపై మరోసారి సమరశంఖానికి పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. గతంలో అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్నల తరుపున ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దీక్ష చేసి రాష్ట్రప్రభుత్వం ముందు పలు డిమాండ్‌లు ఉంచారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఇప్పుడు మరోసారి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ధర్నాకు సిద్దమయ్యారు. అయితే ఈ ధర్నాను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పందించారు. 

ధర్నాను అడ్డుకోవడం వల్ల టిఆర్ఎస్ కు లభించే ప్రయోజనం ఏమిటని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రశ్నించారు. చేనేత కార్మికులకు అండగా నిలిసే నేతలందరికీ గౌరవం దక్కుతుందన్నారు. అడ్డుకుంటే వారి స్థాయి అధంపాతాళానికి దిగిపోతుందన్నారు. టిఆర్ఎస్ కూడా నేత కార్మికులకు మద్దతు పలకడం మంచిదన్నారు. 

ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పార్టీ ప్రోగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం చెప్పారు. అంతేకాక ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులు కూడా పోందామన్నారు. పార్టీ గతంలో చేసిన అన్ని ధర్నాలు, ఆందోళనల మాదిరే ఈ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

వైఎస్‌ విజయమ్మ కరీంనగర్‌ జిల్లాలో చేస్తున్న మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక నేతలు రేయింబవళ్ళు కృషి చేస్తున్నారు. దాదాపు పదివేల మంది నేత కార్మికులు విజయమ్మకు స్వాగతం పలకడానికి సిద్దమవుతున్నారు. ప్రజల నుంచి తాము ఊహించినదానికంటే ఎక్కువగా స్పందన లభిస్తోందని స్థానిక నేతలు చెబుతున్నారు. సిరిసిల్లలో ప్రతి ఇంట్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా లబ్దిపొందారని తెలిపారు. పోలీస్ శాఖ కూడా ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తోం

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!