‘‘నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే సిరిసిల్లలో ధర్నా తలపెట్టాను. టీఆర్‌ఎస్‌నాయకులు, ఉద్యమ సంఘాల నేతలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ ధర్నా ప్రజల సమస్య. దీన్ని తెలంగాణతోనో, మరో రాజకీయాంశంతోనో ముడిపెట్టి చూడొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రజానీకంలో అణగారిన సామాజిక వర్గమైన నేతకారుల సమస్యల పరిష్కారంలో మిగతా పార్టీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాను తలపెట్టిన ధర్నాకు ప్రజాప్రయోజనాల రీత్యా ఎలాంటి ఆటంకమూ కల్పించొద్దని కోరారు. ప్రజా సమస్యలపై పోరాటంలో కలసికట్టుగా పనిచేయాలన్నది తమ అభిప్రాయమన్నారు.

No comments:
Post a Comment