తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 2 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు వచ్చేనెల 2 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డి, విజయలక్ష్మీ ప్రసాద్, చంద్రమౌళి, సీపీఎన్ కార్తీక్, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్‌సింగ్, శామ్యూల్, నిమ్మగడ్డ ప్రకాష్‌లతోపాటు కంపెనీల ప్రతినిధులు కోర్టు ఎదుట హాజరయ్యారు.
హాజరుకు మినహాయింపు కోరిన ధర్మాన: సీఎంతో అధికారిక కార్యక్రమాల్లో, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని, మినహాయింపు ఇవ్వాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయగా అనుమతించారు. నిత్యానందరెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలు హాజరుకు మినహాయింపునూ అనుమతించారు.

No comments:
Post a Comment