YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 20 December 2012

క్రిస్‌మస్‌కి డాడీని ఇంటికి రప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం

అక్టోబర్ 5న బెయిల్ క్యాన్సిల్ చేశాక చాలా బాధపడ్డాను...
తర్వాత సడెన్‌గా హియరింగ్ వస్తే చాలా హ్యాపీగా ఫీలయ్యాను...
ఇక బెయిల్ వస్తుందని. డాడీ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని,
దేవునికి థ్యాంక్స్ చెబుతూ ఒక పాట రాశాను. అది డాడీ చూసి చాలా బాగుందన్నారట. హ్యాపీగా అనిపించింది.
- వర్ష 


ఇందిర: డాడీతో టైం ఎలా స్పెండ్ చేసేవారు...
హర్ష: బెంగుళూరులో హెచ్‌ఎస్‌ఆర్ హౌస్‌లో డాడీ ఒళ్లో కూర్చుని సినిమాలు చూడడం బాగా గుర్తుంది. డాడీకి యాక్షన్ మూవీస్, అడ్వంచర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఏ సినిమా ఒక్కసారికన్నా చూడరు. స్టార్‌వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, 10000 బిసి ... ఈ మూడు సినిమాలే నాకు తెలిసి ఆయన రెండుమూడుసార్లు చూసి ఉంటారు. ఒక్కోసారి సినిమా అయిపోయిన తర్వాత నేను, డాడీ ఆ సినిమా గురించి డిస్కస్ చేసేవాళ్లం.

ఎస్పెషల్లీ నేను చదివిన నవలలను సినిమాల కింద తీస్తే రెండిటిలోనూ తేడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చెప్పేదాన్ని! డాడీ చాలా ఇంట్రస్టింగ్‌గా వినేవారు.
వర్ష: అమ్మ మాకు చదువు చెప్పాక డాడీ ఒళ్లో కూర్చుని నేను, అక్క సినిమా చూసేవాళ్లం. అమ్మ కూడా జాయినయ్యేది. వాళ్ల ముగ్గురికీ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. అప్పట్లో నాకు అంత నచ్చేవి కాదు. అందుకని వాళ్లు చూస్తుండగా నేను నిద్రపోయేదాన్ని. ఇదికాక డాడీతో కూర్చుని 8-9 మధ్య టీవీ షోస్ చూసేవాళ్లం. జాపనీస్ యానిమే అంటే డాడీకి, నాకు ఇష్టం... ఇంకా,బెంగుళూరులో ఉండగా డాడీతో ఓ గంటపాటు కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేసేవాళ్లం.
హాలిడేస్ వచ్చాయంటే కంటిన్యుయస్‌గా మూవీస్ చూసేవాళ్లం. వెకేషన్‌కి వెళ్లినప్పుడు కూడా డాడీతో చాలా ఫన్ ఉండేది.

ఇందిర: డాడీలో మీకు నచ్చే విషయం...
హర్ష: డాడీతో ఉంటే చాలా ఫన్... మాతో ఉంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు... దేనికీ ఫోర్స్ చేయరు. అది నాకు చాలా నచ్చుతుంది.
వర్ష: డాడీ ఏ విషయంలోనూ కంప్లయింట్ చేయరు. ఎప్పుడూ తిట్టడం కానీ, కోప్పడ్డం కానీ చేయరు.
ఇందిర: మీరు నైస్ అవడం వల్లా? డాడీ నైసా?

వర్ష: (నవ్వేసి) డాడీనే నైస్ కాబట్టి!
ఇందిర: డాడీతో మెమరబుల్ ఇన్సిడెంట్స్...

హర్ష: నాకు గుర్తున్న ఇన్సిడెంట్స్‌లో ఒకటి .... ప్రతి శనివారం నేను, వర్ష అమ్మతోపాటు పెయింటింగ్ చేసేవాళ్లం. ఓసారి డాడీ కూడా మాతో జాయినయ్యారు. పెయింటింగైతే చేయలేదు కానీ, నాది, వర్షది ఏదో పిక్చర్ గీసి, షేడింగ్ చేసివెళ్లారు. (నవ్వుతూ) బాగానే గీశారు.

వర్ష: నాకు నిద్రంటే ఇష్టం. సెలవుల్లో, ... ఆదివారాల్లో 9.30 అయినా లేవడం ఇష్టపడను. కానీ, డాడీ ఇంట్లో ఉన్నారంటే, 8-9 కల్లా బెడ్ దగ్గరికి వచ్చి షేక్ చేసి మరీ నవ్వుకుంటూ లేపేస్తారు. ఆయనకు మాతో స్పెండ్ చేయాలని ఉంటుంది కాబట్టి, తర్వాత ఆయనకు కుదరదు కాబట్టి, బద్ధకమున్నా డాడీకోసం లేచేసేదాన్ని.

హర్ష: ఇంకోటి... నా బర్త్‌డేకి ... డాడీ దగ్గర మంచి పేపర్స్ లేవు.. కలర్స్ లేవు... మామూలుగా ఆయన బిజీగా ఉండే మనిషి... కార్డులు చేయడం రాదు కదా! కానీ, కష్టపడి, పెన్నులు లేకపోయినా కలర్ పెన్సిల్స్ లేకపోయినా, ఉన్నదాంతో కార్డు చేసి, మంత్లీ క్యాలెండర్ మీద స్మైలింగ్ ఫేస్ గీసి, లెటర్ కూడా రాసి పంపారు. ఇప్పటిదాకా నాకొచ్చిన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్!

ఇందిర: డాడీ మీద మీకేమైనా కంప్లయింట్స్ ఉండేవా?
హర్ష: మేం బెంగుళూరులో ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు డాడీ హైదరాబాద్‌కు వచ్చి 2-3 రోజులు వుండేవారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ పూర్తిగా షిఫ్టయినప్పుడు ఫ్రెండ్స్‌ని మిస్సవుతానని నాకు ఇష్టంలేకపోయినా, కనీసం డాడీతో రోజూ టైం స్పెండ్ చేయవచ్చునని అనుకున్నాను. కానీ, ఇక్కడికొచ్చాక డాడీ ఓదార్పుతో బిజీగా ఉండడంతో నెలకు ఒకసారే కలవగలిగేవాళ్లం. కానీ ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే... ఇప్పుడు అది కూడా లేదు. స్కూల్ ఉన్న టైంలో ములాఖత్ ఉండడంతో, ఎప్పుడో రెండు నెలలకోసారి రెండు గంటలు కలవగలుగుతున్నాం.

వర్ష: ఓదార్పు ఉండగా మేం కంప్లయింట్ చేసేవాళ్లం... మాకు టైం ఎక్కువ ఇవ్వండి డాడీ... అని! కానీ అప్పుడే నయం... ఇప్పుడు అసలు కుదరడం లేదు. ఓదార్పే బెటర్... అన్నివిధాలా... మాతో స్పెండ్ చేయకపోతే చేయకపోయారు... ఆయనకు నచ్చింది, తను కరెక్టనుకున్నది చేసుకుపోయేవారు. ఇప్పుడు ఏమీ చేయటానికి లేదు. అది చాలా బాధగా ఉంటుంది. అప్పట్లో టీవీలో చూసేవాళ్లం. ఫోన్‌లో మాట్లాడగలిగేవాళ్లం.ఇప్పుడు ఎక్కడా కనపడరు. మాట్లాడడానికి లేదు.

ఇందిర: పోనీ లెటర్లు అవీ రాయచ్చుగా...
హర్ష: రాస్తాం. నేను ఫ్రెండ్స్ గురించి, మూవీస్ గురించి ఎక్కువ రాస్తాను. డాడీ కూడా అప్పుడప్పుడు లెటర్స్ రాసి మమ్మీకి ఇచ్చి పంపుతుంటారు. దానిలో 2, 3 పేరాలు మూవీస్ గురించే ఉంటాయి.

వర్ష: నేనైతే ఏయే సబ్జక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో రాస్తాను. లెటర్స్ నిండా స్మైలింగ్ ఫేసెస్ పెడుతుంటాను... ఎందుకంటే డాడీ ఎప్పుడూ స్మైల్ చేస్తుండాలని! అప్పుడప్పుడు నలుగురం ఫ్యామిలీగా కలిసి ఉన్నట్టుగా కూడా బొమ్మలు గీసి పంపుతుంటాను.

ఇందిర: మరి డాడీ రిప్లైలు ఇస్తారా?
వర్ష: ఇస్తారు... నా హ్యాండ్ రైటింగ్ బాగుంటే మెచ్చుకుంటారు...కానీ, ఓసారి బాలేకపోతే, ‘నీ స్పెల్లింగ్స్‌లో చాలా తప్పులున్నాయి. నేను చెప్పేంత వాడిని కాదు. ఎందుకంటే... ఎప్పుడూ మమ్మీ అంటుంది - నావి కూడా బ్యాడ్ అని. కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. తప్పదు’ అని రాశారు. ప్రతి లెటర్‌లోనూ మా సిస్టర్‌కి చెప్తారు... నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని... నా ఇంపార్టెన్స్‌ను గుర్తించాలని! (నవ్వుతూ) కానీ ఇన్నిసార్లు రాసినా, అక్క ఇప్పటికి కూడా గుర్తించలేదు.

హర్ష: అదే విషయం డాడీకి నేను రాశాను కూడా... నేను ఇప్పటికీ చెల్లెలి ఇంపార్టెన్స్ గుర్తించలేదని!
ఇందిర: స్కూల్లో ఫ్రెండ్స్ డాడీ గురించి ఏమైనా అడుగుతుంటారా?

హర్ష: ఫ్రెండ్స్ ఆ విషయం అసలు ఎత్తరు.. వాళ్లు చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటారు.
వర్ష: నా ఫ్రెండ్స్ కూడా చాలా స్వీట్... ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకులే అని అనుకుంటారేమో... ఎవరూ అడగరు.

ఇందిర: అసలు డాడీని ఎందుకిలా చేశారో తెలుసా?
వర్ష: ఓదార్పు చేయడం లీడర్స్ ఎవరికీ ఇష్టంలేదు. డాడీకి ఇంతమంది సపోర్ట్ ఇవ్వడం కూడా వాళ్లకి నచ్చలేదు. డాడీని ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు పెట్టేలాగా రాంగ్ డీల్స్ చేస్తున్నారు అందరూ. నాట్ ఫెయిర్!

హర్ష: అంతేకాదు, వాళ్లని వాళ్లు (హర్ష ఉద్దేశంలో ప్రత్యర్థులు) బెటర్ చేసుకునేకన్నా అవతలి వాళ్లని తక్కువ చేయడంలోనే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. డాడీని వాళ్లు అన్యాయంగా బాధపెడితే వాళ్ల సంగతి కూడా దేవుడే చూసుకుంటాడు. డాడీ అలా చేయరు కాబట్టి డాడీ పట్ల దేవుడు డెఫినిట్లీ కైండ్‌గా ఉంటారని అనుకుంటున్నాను.

ఇందిర: డాడీకి బెయిల్ రానప్పుడు చాలా బాధపడ్డారట కదా..
హర్ష: ప్రతిసారీ బెయిల్ వస్తుందీ... రాదు... అంటున్నప్పుడు చాలా బ్యాడ్‌గా ఫీలవుతాం. మా అందరికంటే మమ్మీ ఎక్కువ డిప్రెషన్ ఫీలవుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ మమ్మీ ఏడవగా చూడలేదు. ఎప్పుడూ మమ్మల్ని హ్యాపీగా ఉండమని చెప్పే అమ్మే... అలా డిప్రెషన్లో ఉండి ఏడుస్తుంటే ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాక హెల్ప్‌లెస్‌గా ఫీలయ్యి, సెలైంట్‌గా ఉంటాం. స్పేస్ ఇస్తే బెటరని వదిలేస్తాం.

వర్ష: వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీకి కూడా అంతే! డాడీ పక్కన లేరని మమ్మీ చాలా శాడ్‌గా ఫీలయ్యింది... ఏడ్చింది... ఇంకోసారి ప్రేయర్‌లో కూడా అంతే... ఇంకా పేయర్ మొదలెట్టకుందే ఏడ్చింది. మాకేం చేయాలో అర్థం కాక... ఏదో మాట్లాడబోయి నెగిటివ్ మాట్లాతామేమో అనే భయానికి ఇంకా బ్యాడ్ అవుతుందని ఏం మాట్లాడకుండా కూర్చున్నాం.

ఇందిర: బెయిల్ వస్తుందనుకున్న రోజు... 7 ఎస్‌ఎంఎస్‌లు పంపావట!
వర్ష: స్కూల్‌కు వెళ్లినప్పుడు కనీసం ఓ ఇరవై సార్లయినా ప్రేచేసి ఉంటాను. టెన్షన్ అనిపించి స్కూల్ నుంచి బయటకు రాగానే కారులోకి రాగానే సెల్ తీసుకుని మమ్మీకి 7 ఎస్‌ఎంఎస్‌లు పంపాను. ఏమైంది... ఏమైంది... అని పంపాను. కానీ, ఆరోజు కూడా రాలేదు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే, అందరూ ఇంత ప్రే చేస్తున్నారు... బైబిల్‌లో ఉంటుంది... ‘దేవుని పేరు మీద ఇద్దరు ముగ్గురు కలిసి ప్రే చేస్తే అనుకున్నది జరుగుతుంది’ అని! అందులోనూ చాలామంది ప్రే చేస్తున్నారు... కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది అనుకున్నాను.

ఇందిర: డాడీ బర్త్‌డే రోజు కలుస్తారు కదా... ఏం గిఫ్ట్ ఇస్తున్నారు?
హర్ష: క్రిస్మస్‌కి డాడీ ఇంటికి వస్తారని దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. అందుకే, డాడీ కోసం తనకు నచ్చే ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్, డార్క్‌నైట్ రెజైస్ మూవీస్ కొన్నాను.

వర్ష: చాలా ఫోటోలు, రాతలతో కూడిన స్క్రాప్ బుక్ తయారుచేస్తున్నాం. ఆ పిక్చర్స్ పెట్టి, ఆ టైంలో ఏం జరిగింది... అవన్నీ రాస్తాను. స్క్రాప్‌బుక్కే కాకుండా కలర్‌ఫుల్ కార్డు కూడా తయారుచేస్తున్నాను డాడీకి... కాలిగ్రఫీలో ఇంతవరకు ఎప్పుడు రాయనంత అందంగా... స్పెషల్ కార్డును తయారుచేయాలనుకుంటున్నాను. చాలా స్మైలీ ఫేసెస్ పెట్టి!

ఇందిర: మీకన్నా ముందు ఈ పేపర్ వెళ్తుంది... మరి డాడీకి ఏం విషెస్ చెప్తారు?
హర్ష: హ్యాపీ బర్త్‌డే డాడీ! మీరు మాతో ఉంటే బాగుండేది... కానీ, మేమే మిమ్మల్ని కలవడానికి వస్తాం!
వర్ష: హాయ్, హ్యాపీ బర్త్‌డే డాడీ! మీరు బయటకొచ్చేసి మాతోపాటు ఉండుంటే చాలా బాగుండేది. ఇంట్లో చాలామందితోపాటు మీ బర్త్‌డే చేసుకునేవాళ్లం. బట్.. పర్లేదు... అక్కడ కూడా... మిమ్మల్ని చూడగలుగుతాం కదా అది చాలు...

హర్ష: క్రిస్మస్‌కి మాత్రం మీరు బయటకు రావాలి. లేకపోతే మీరు మన ఇంటి ట్రెడిషన్‌ని (చుట్టాలందరితో పులివెందులలో గడపడం) బ్రేక్ చేసినట్టవుతుంది.

ఇందిర: మీకు తాత ఎంత గుర్తున్నారు?
వర్ష: ఎప్పుడు అబ్బకు హాయ్ చెప్పినా వెంటనే ఎత్తుకునేవారు. అమ్మ నాకు శ్రేయ అని పెట్టాలనుకుంటే... అబ్బ తనకు ఇష్టమని వర్ష అని పెట్టుకున్నారు. అందుకే ప్రతిసారీ, ప్రతి వర్క్‌బుక్, ప్రతి షీట్‌లో, ఏ నోట్‌బుక్‌లో ఎప్పుడు ఆ పేరు రాసినా... అబ్బను తలచుకోకుండా ఉండలేను.
హర్ష: అబ్బ పోయి మూడేళ్లయినా చాలా ఏళ్లయినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, అబ్బ పోయినప్పటినుంచీ మాకు ఏదీ సరిగా జరగడం లేదు.
ఇందిర: తాతలో, నాన్నలో... మీకు నచ్చే విషయాలు...
హర్ష: అబ్బకి, నాన్నకి - ఇద్దరికీ ప్రజలకు హెల్ప్ చేయడం చాలా ఇష్టం.. వాళ్లు చేసే ప్రతి పనినీ ఇష్టంగా చేస్తారు. మంచిగా చేస్తారు. ఒకసారి చేయాలనుకుంటే పట్టుదలతో చేయడం, చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం, ప్రతిరోజూ దేవునికంటూ కొంత టైం కేటాయించడం, స్పిరిచ్యువల్ గెడైన్స్... ఏది చేసినా ‘మేం చేస్తున్నాం’ అని అనుకోకుండా దేవుడు చేస్తున్నాడు అని అనుకుని చేయడం... నాకు ఇద్దరిలో నచ్చుతుంది.

వర్ష: ఈరోజు డాడీ ప్లేస్‌లో అబ్బ ఉండుంటే... ఇలానే డాడీలానే కామ్‌గా ఉండేవారు. ఇద్దరికీ అసలు ఎప్పుడూ కోపం రాదు. ఎవరిమీదా అరవరు... వాళ్లు థింక్ చేసే విధానం, యాటిట్యూడ్ ఒకేలా ఉంటుంది. ఇద్దరూ బైబిల్ బాగా చదువుతారు, ప్రేయర్స్ ఎక్కువ చేస్తారు. ఒకేలా ఆలోచిస్తారు. ఇద్దరికీ దేవుడంటే చాలా ఇష్టం. మేం కొంచెం పెద్దయిన తర్వాత మమ్మల్ని అబ్బ దగ్గర పెట్టాలని అమ్మకు చాలా ఉండేదట. అలా చేస్తే మేం కూడా అబ్బలాగా పేషన్స్‌తో ఉంటామని!

ఇందిర: వీటిల్లోంచి డాడీ దగ్గర నేర్చుకోవాలనుకునేవి...
హర్ష: కామ్‌గా ఉండడం, పేషన్స్‌తో ఉండడం... డాడీకి ఎప్పుడైనా ఫోన్లు వస్తుంటే.. ఇంకెంత సేపు మాట్లాడతారు... అని చెవిలో అరుస్తుండేవాళ్లం... అయినా కూడా ఎప్పుడూ మా మీద ఒక్కసారి కూడా ఆయన విసుక్కోరు... వేలితో ‘ఒక్క నిమిషం ఒక్క నిమిషం’ అని సైగ చేసేవారే తప్ప కోప్పడేవారు కాదు. మేమిద్దరం కొట్టుకున్నా, కొట్టుకోవద్దని కామ్‌గా చెప్తారు గానీ అరవరు.

వర్ష: అందరికోసం టైం కుదుర్చుకునేవారు. (నవ్వుతూ) కానీ, కజిన్స్ అందరినీ అక్క తనే పిలుస్తుంది... కానీ ఎవరితో మాట్లాడకుండా తన గొడవన తను పోయి పుస్తకాలు చదువుకుంటుంది... ఎవ్వరికీ ఇవ్వడానికి తన దగ్గర టైం ఉండదు... కానీ మా డాడీ అలా కాదు... అందరికీ ఇవ్వడానికీ టైం ఉంటుంది మా డాడీ దగ్గర. ఐ గెస్ అబ్బ కూడా అలానే! అమ్మ చెప్తూ ఉంటుంది... ఎంత పెద్ద పార్టీ పెట్టినా, ఏం చేసినా అందరితో రెండు నిమిషాలు అయినా అదే పనిగా వచ్చి మాట్లాడేవారట... డాడీ కూడా అంతే!

ఇందిర: ఇలా జరుగుతున్నందుకు దేవుని మీద ఎప్పుడూ కోపం రాలేదా?
హర్ష: ‘నువ్వు అనుకుంటే అయిపోదా’ అని దేవుడ్ని చాలాసార్లు అడగాలనిపించింది కానీ, ఆలోచిస్తే అనిపించింది... ప్రతి మనిషి విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది! దేవుడు మనల్నీ చేశాడు... ప్రపంచంలోని అందర్నీ చేశాడు. ఎవరేంటో దేవునికి తెలుసు. అందరం ఆయన క్రియేట్ చేసినవాళ్లమే కాబట్టి ఆయనకు ఎవరిని ఏం చేయాలనేది బాగా తెలుసు. మనకు ఎవరేంటో తెలీదు కాబట్టి అన్నీ ఆయనకు వదిలేయటం బెటర్!

వర్ష: అయితే, ఇంతకుముందు ఉన్నదానికన్నా ముందు ముందు బాగా వుంటుందని హోప్ వుంది. అన్నీ బాగా అయిపోయేరోజు వస్తుందని, అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మన మంచికే జరిగిందని అప్పుడనిపిస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.


sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!