రాష్ట్రమంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేయడంతోపాటు జగన్ పేరిట ప్రత్యేక పూజలు, యాగాలు చేయిస్తూ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, రోగులకు పండ్లు, వృద్ధులకు దుప్పట్లు, అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ జగన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
* మల్కాజ్‌గిరిలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు.
* కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్ చౌరస్తాలో చండీయాగం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు.
* ఉప్పల్‌లో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
*రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు పాలు, పండ్లు పంచారు.
* కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేష్ట్య రమేష్‌బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
* నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంచారు.
*ఖమ్మం జిల్లా వైరాలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. మదిరలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. భద్రాచలంలో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్టీ కార్యాలయంలో జక్కంపూడి విజయలక్ష్మీ, ఆదిరెడ్డి అప్పారావు, బొమ్మన రాజ్‌కుమార్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. పి.గన్నవరంలో పేదలకు చీరలు, దుప్పట్లు, రోగులకు పండ్లు పంచారు.
* నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్‌ఆర్ సీపీ నేత ఆదురి కరుణ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాలిగౌరారం మండలంలో సంకినేని వెంకటేశ్వరరావు వర్గీయులు విద్యార్థులకు స్వీట్లు, రోగులకు పండ్లు పంచారు. కోదాడలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
* కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అనాధ, వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లాలోని హుజూరాబాద్‌లో పేదలకు పాలు, పండ్లు పంచారు.
* విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే ఆర్‌వీ కృష్ణరంగారావు ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
* కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ అనాథ ఆశ్రమంలో వేడుకలు జరిపారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
* ప్రకాశం జిల్లా కేసరగుట్ట కాలనీలో యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు.
*మెదక్ జిల్లా జహిరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

No comments:
Post a Comment