ఈ నెల 21న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడతామని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆ రోజున రక్తదాన శిబిరాలు, పండ్లు, దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్‌ను అక్రమంగా జైలులో నిర్బంధించినందుకు నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment