వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విభాగాలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆ రోజున పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, పండ్లు, దుప్పట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దానితో పాటు పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించడంపై ఆయా విభాగాలు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
శ్రీ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 21వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మెగా శిబిరంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతాప్‌రెడ్డి తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
http://www.ysrcongress.com/news/news_updates/jaga___nmOhan_reDDi_puTTina_rOjuna_saevaa_kaaryakramaalu.html
No comments:
Post a Comment