దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవని, సోనియా గాంధీ ఆలోచనలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆ పార్టీపై ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108,104, ముస్లింల రిజర్వేషన్ ......పథకాలన్నీ వైఎస్ ప్రవేశపెట్టినవేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ప్రవేశపెట్టారని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కూడా సోనియా గాంధీ ఆలోచన అని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవన్న కేంద్ర మంత్రి గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉచిత విద్యుత్ ఎవది? వైఎస్ఆర్ ఆలోచన కాదా? అని అడిగారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇతర రాష్ట్రాలలో ఈ పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ పాలనలో అయిదు సంవత్సరాలూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచనని రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన మరణించగానే విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment