వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల కాలికి రేపు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంఆర్ ఐ స్కాన్ లో షర్మిల గాయం తీవ్రమైనట్లు తేలింది. ఆమె కుడి మోకాలిలో రెండు రకాల గాయాలయ్యాయని డాక్టర్ తెలిపారు. షర్మిలకు కీ హోల్ ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ తర్వాత కాలికి సిమెంట్ కట్టు కట్టాల్సి ఉందని చెప్పారు. మూడు వారాల తర్వాత కట్టు తొలగిస్తామన్నారు. ఆ తర్వాత మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ చెప్పారు.
కాలి గాయంతో షర్మిల సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. విశ్రాంతి అనంతరం షర్మిల పాదయాత్రను కొనసాగిస్తారని శోభా నాగిరెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment