వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కుట్రకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు 'జనం సంతకం' అనే పేరుతో ఉద్యమం చేపట్టారు. కోటి మందితో సంతకాలు చేయించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలన్నది వారి ఉద్దేశం. పార్టీ ఎస్ టి విభాగానికి చెందిన నేత రవీంద్ర నాయక్ తొలి సంతకం చేశారు.
జనం సంతకం పేరుతో వైఎస్ఆర్ సీపీ నేతలు ఒక లేఖను విడుదల చేశారు. వైఎస్ జగన్ పై రాజకీయపరంగా బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నాం. జగన్ ను దోషిగా చూపడానికి సిబిఐ అహర్నిశలూ చేస్తున్న ప్రయత్నాలు పరాకాష్టగా భావిస్తున్నాం. 200 రోజులుకు పైగా జగన్ ను అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా జగన్ పై కక్ష సాధింపు ఆపాలని కోరుతున్నాం. ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేస్తున్న విజ్ఞప్తి ఇది అని ఆ లేఖలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment