నాప్కాబ్ ఉపాధ్యక్షుడు, మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. చందర్లపాడు మండలం రామన్నపేటలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వసంత నాగేశ్వరరావుకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇంటిదగ్గర కూర్చున్న తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తింపునిచ్చి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా, నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రుణం తీర్చుకునేందుకు ఆయన తనయుడు స్థాపించిన పార్టీలో చేరి సామాన్య కార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉదయభాను మాట్లాడుతూ.. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ప్రజలను నమ్మించి ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ తరువాత ఆ మాటల్ని మరచిపోయారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment