‘వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ గర్జన’ పేరిట త్వరలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశాక విలేకరులతో మాట్లాడారు. జనవరిలో మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని, ఈ విషయమై విజయమ్మతో చర్చించానన్నారు. ఆయన వెంట పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment