ఆంధ్ర దేశమంతటా జగన్ అనే ఒకే ఒక నినాదం ప్రతిధ్వనిస్తుంటే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కట్టడి చేయడానికి వేరే మార్గం లేక నిత్యం ప్రజలమధ్య ఉండవలసిన వ్యక్తిని జైలుపాలు చేయడం ఎంతవరకు న్యాయం? ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేకనే రాష్ర్ట ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలొస్తాయా, అని ఎదురు చూస్తూ తమ వద్ద ఉన్న ఓటు అనే ఆయుధాన్ని జగన్‌ని, ఆయన కుటుంబాన్ని టార్చర్ పెడుతున్న వారిపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రత్యర్థులను తేరుకోకుండా చేయాలని ఎదురుచూస్తున్నారు. సెలెక్ట్ బిఫోర్ ఎలెక్ట్ అన్న చందంగా ఎలెక్షన్స్ నామ్ కే వాస్తే అని జగన్‌ను సెలెక్ట్ చేసుకుని, అతనే మా ముఖ్యమంత్రి అని యువకులు ఎప్పుడో ప్రకటించారు.
అదే సమయంలో షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’తో కాంగ్రెస్ అధిష్టానం కళ్లు బైర్లు కమ్మే స్థితి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షం బీరాలు పలుకుతూ బేరాలు చేస్తూ ఎన్నాళ్లు ప్రజల్ని వంచించగలరు? ఎన్నాళ్లీ మేకపోతు గాంభీర్యం? రాష్ట్రంలోని పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ‘పదునాల్గు భువనాలు ఏకమైనా రెండువేల పదునాల్గులో జగనే ముఖ్యమంత్రి’ అని తేలిపోయింది.
ఎవ్వరేమన్నను, తోడు రాకున్నను, పోరా బాబూ పోరా, నీ గమ్యం చేరిపోరా అన్నట్టుగా జగన్ తన ‘గోల్’ను సాధించి, ఇతర పార్టీలను ‘గోల్‌మాల్’ చేస్తాడు. ఆంధ్రదేశ నలుమూలలా తిరిగి రాజన్న అభివాదం చేస్తుంటే ప్రజలంతా అభిమానంతో చెయ్యెత్తి జైకొట్టేవాళ్లు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలేసేవాళ్లు. జనమంతా నీరాజనం పలికేవాళ్లు. అది మళ్లీ జగన్ రాకతోనే సాధ్యం. ప్రజాభిమానం, ప్రజావిశ్వాసం ఉన్న నిజాయతీ, నిస్వార్థం గల నాయకులారా! ఇకనైనా మేల్కోండి. జగన్ వెంట నడవడానికి సిద్ధం కండి. ప్రజాసేవ చేసుకుని ధన్యులు కండి. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడండి.
- దాసరి నాగేశ్వరరావు, బొబ్బిలి, విజయనగరం
No comments:
Post a Comment