వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా, కువైట్, దుబాయ్ తదితర దేశాల్లో అభిమానులు, కార్యకర్తలు పలుసేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశాన్య అమెరికాలో ఉంటున్న వైఎస్ అభిమానులు నిత్యావసర సరుకులు సేకరించి న్యూజెర్సీలోని మెర్సర్ స్ట్రీట్ ఫ్రెండ్స్, న్యూయార్క్‌లోని పీపుల్ టూ పీపుల్ అనే సంస్థలకు విరాళంగా అందజేశారు. ఆళ్ల రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. కువైట్‌లోనూ: జగన్ పుట్టినరోజు సందర్భంగా కువైట్‌లో 3వేల మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా సంతకాల సేకరణ చేశారు. వీటిని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల ప్రభాకర్, చంద్రశేఖర్‌రెడ్డి, గోవింద్ నాగరాజు, సయీద్ నాజర్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. |
Saturday, 22 December 2012
అమెరికా, కువైట్‌లలో జగన్ జన్మదిన వేడుకలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment