తెలుగు కళాకారుల సంక్షేమం కోసం మహానేత వైఎస్ఆర్ చేసిన కృషి మరువలేనిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించడంలో విశేష కృషి చేసిన వైఎస్ఆర్ పేరు ప్రపంచ తెలుగు మహాసభల్లో కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం పక్షపాత ధోరణితో వైఎస్‌ఆర్ పేరుతో ఉన్న కళాసంస్థలను అణగదొక్కుతోందన్నారు. సొసైటీ ఎన్నికల ఓట్ల నమోదు విషయంలో అధికారులు కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు తిరగబడతారని బాలినేని హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment