YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 18 December 2012

షర్మిల మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స - ఆరు వారాలు విశ్రాంతి అవసరం: అపోలో వైద్యుల సలహా

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్సులో ఉన్న అపోలో ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం ఈ శస్త్ర చికిత్స జరిగింది. శ్రీమతి షర్మిలకు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరం అని అపోలో ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. శస్త్ర చికిత్స పూర్తయిన అనంతరం వైద్యులు ఈ విషయం ప్రకటించారు. విశ్రాంతి సమయంలో ఆమెకు ప్రతి రోజూ ఫిజియో థెరఫీ చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి సెల్‌ థెరపీ కూడా చేస్తామని వారు వెల్లడించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!