నల్గొండ: సహకార ఎన్నికల ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమం అవకతవకలగా సాగుతోంది. జిల్లాలోని మేళ్ల చెరువు మండలం చింతలపాలెం సహకార కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఓటరు సభ్యత్వ నమోదు సభ్యత్వ కార్యక్రమం ఇంకా కొనసాగడం వెనుక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ప్రకాశం: సహకార ఎన్నికల ఓటర్ల నమోదులో ఢీసీఓ కొండయ్య అవకతవకలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిన డీసీఓను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిర్బందించారు.
గుంటూరు:సభ్యత్వ దరఖాస్తులు లేకుండా ఓట్లు నమోదు చేసిన ఘటన నాదెండ్ల సహకార సంఘ కార్యాలయంలో జరిగింది. దరఖాస్తులు లేకుండా సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగడంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకూ న మోదు చేసిన సభ్యత్వ దరఖాస్తులు చూపించాలని వైఎస్సార్‌సీపీ నేత మర్రి రాజశేఖర్ కార్యకర్తలతో కలసి కార్యాలయం ముందు బైఠాయించారు. |
No comments:
Post a Comment