షర్మిలకు కాలి గాయం తీవ్రం.. ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తన పాదయాత్రకు మరో రోజు విరామం ప్రకటించారు. ఆమె కుడికాలు మోచిప్పకైన గాయం నొప్పి తీవ్రం కావడంతో విశ్రాంతి తప్పనిసరి అని ఆర్థోపెడిక్ వైద్యులు సూచించారు. ఆదివారం ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ విద్యాసాగర్, సీఎస్ రెడ్డి, శివభారత్ రెడ్డి ఆమెను వేర్వేరుగా పరీక్షించారు. ఈ గాయాన్ని వైద్య పరిభాషలో లిగ్మెంట్ ఇంజరీ అంటారని సీఎస్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌లోని బస కేంద్రంలో ఉన్న షర్మిలను ఆదివారం దిల్‌సుఖ్‌నగర్ కోనార్క్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేశారు. స్కానింగ్ రిపోర్టులు సోమవారం అందుతాయని వైద్యులు తెలిపారు. సోమవారం కూడా పాదయాత్రకు విరామం ఉంటుందని ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. షర్మిలను ఆదివారం పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు రాజ్‌ఠాకూర్, పుత్తా ప్రతాప్, దేప భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు. |
Sunday, 16 December 2012
పాదయాత్రకు మరో రోజు విరామం!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment