తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి పెద్దఎత్తున వైఎస్ఆర్సిపి వైపు ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన చెప్పారు. త్వరలో చాలా మంది పార్టీలో చేరుతారన్నారు. రేపు నిర్మల్లో జరగనున్న బహిరంగ సభే దీనికి నిదర్శనం అని చెప్పారు. నిర్మల్లో రేపు జరగనున్న వైఎస్ విజయమ్మ బహిరంగ సభ వేదికను ఆయన పరిశీలించారు. ఆయనతోపాటు పార్టీ నేతలు తలశిల రఘురాం, బోడ జనార్ధన్, ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment