టీఆర్‌ఎస్ దాడులకు దిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, గట్టిగా ఎదుర్కొని తగిన రీతిలో జవాబిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు హెచ్చరించారు. మంగళవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ కార్యాలయాలు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణవాదులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం, ఇతర పార్టీల నేతలను తెలంగాణలో తిరగనీయబోమంటూ రెచ్చగొట్టే విష సంస్కృతి టీఆర్‌ఎస్‌ది అని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలే లేవన్నారు. ‘‘ఇతర పార్టీల కార్యాలయాల వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్ దాడులు చేస్తేనేమో ధర్నా అవుతుందా? అదే ఇతర పార్టీలు ధర్నా చేసినా దాడులు అని చెప్పడం టీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారింది. కేసీఆర్ మాట్లాడే బూతు మాటలకు 20 సార్లు దాడులు చేసి ఉండాలి. కానీ కొట్టడం, దాడుల సంస్కృతి మాది కాదు’’ అని గట్టు చెప్పారు. కేసీఆర్ ధోరణి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు.
ప్రతిఘటనకు దిగుతాం: రెహ్మాన్
టీఆర్‌ఎస్ తన వైఖరి మార్చుకోకపోతే తామూ ప్రతిఘటనకు దిగుతామని, వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహ్మాన్ హెచ్చరించారు. ఎక్కడో విజయనగరంలో పుట్టిన కేసీఆర్ ఇపుడు ఇక్కడకు వచ్చి తెలంగాణకు తానే గుత్తేదారునని అంటే ఏ మాత్రం చెల్లదని స్పష్టంచేశారు.
No comments:
Post a Comment