వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో పార్టీ శ్రేణులు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు వృద్దాశ్రమాల్లో అన్నదానం నిర్వహించారు. జగన్ పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. వైఎస్ జగన్‌కు మేలు జరగాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తాడేపల్లి విజయకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖలో వైఎస్‌ఆర్ సీపీ పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. వికలాంగులకు వీల్‌చైర్‌లు అందజేశారు. విశాఖలోని 72 వార్డుల్లో వృద్ధులు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలోనూ జగన్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానంతో పాటు అన్నదానం చేశారు. బెజవాడలోని ఎస్ కేసివి అనాధ ఆశ్రమమంలో పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. జగన్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ లో ఘనంగా జరిగాయి. నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జగన్ పేరిట అర్చనలు చేశారు. ఆయన త్వరలో జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షించారు. కువైట్ లోనూ జగన్ జన్మదిన వేడుకలను ప్రవాసాంధ్రులు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్. సీబీఐ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఈరోజు సాయంత్రం మాలియాలో సంతకాల సేకరణ చేపట్టనున్నారు. |
Friday, 21 December 2012
రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment