చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజంపల్లెలో వేంచేసియున్న తిరుమలనాథ స్వామి ఆలయంలో శనివారం బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లమట్ల గ్రామానికి చేరుకున్న ఆయన అభిమానుల సమక్షంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా తిరుమలనాథ ఆలయ చైర్మన్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment