YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 22 December 2012

లాఠీచార్జీ అమానుషం: విజయమ్మ

దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థులపై ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు. నేటికి కూడా దేశ రాజధానిలోనే పట్టపగలు మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితి లేదు. ఢిల్లీ నడివీధుల్లో ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందంటే, పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమవుతోంది’ అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన మూలాలపై అధ్యయనం చేయకుండా, నిరసనకారులపై లాఠీలు ప్రయోగించడం అమానుషమన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!