తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెప్పే టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రాళ్లు, కర్రలెందుకున్నాయని కొండా సురేఖ నిలదీశారు. ఇది ఉద్యమకారుల లక్షణమా అని ప్రశ్నించారు. కొండా దంపతులు మంగళవారం సాయంత్రం హన్మకొండలోని తమ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శాంతియుతంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వెళ్తే దాడులు చేశారని సురేఖ విమర్శించారు.
‘‘రెచ్చగొట్టే ప్రకటనలతో అమాయకులను బలి తీసుకుంటూ కేసీఆర్ తన ఖాతాలో వేల కోట్లు జమ చేసుకున్నారు. కుటుంబంలో ఒకరికి కార్పొరేట్ సంస్థలు, జాగృతి పేరుతో కుమార్తెకు సినీ రంగం, అల్లుడికి రియల్ ఎస్టేట్ రంగాన్ని అప్పగించారు’’ అని దుయ్యబట్టారు. ‘‘రాజీనామా చేయాలంటూ ఇళ్లపై దాడులు, నిరసనలకు దిగినా ఓపిగ్గా ఉన్నాం. 3 నెలల్లో తెలంగాణ తెస్తామంటూ పరకాల ఉపఎన్నికల్లో ఊదరగొటిన్ట కేసీఆర్, ఆరు నెలలైనా ఎందుకు తేలేదో అడిగే నైతికహక్కు నాకుంది. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటిదాకా ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు. ప్రజలను మాత్రం మాటలతో రెచ్చగొడుతున్నారు. అందుకే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నాను. ఎవరికీ కడుపుకోత లేకుండా కేసీఆర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తదంటూ నిలదీశాను’’ అని చెప్పారు. సురేఖ మాటకు కట్టుబడే మనిషని, సోనియా ఇంటి ముందు ఆత్మహత్యకు ఆమె సిద్ధమని కొండా మురళీధరరావు అన్నారు. ‘‘అందుకు కేసీఆర్ కూడా సిద్ధమైతే బహిరంగంగా ప్రకటించాలి. తెలంగాణ కోసం ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటే టాంక్‌బండ్‌పై వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తా’’నని ప్రకటించారు.
No comments:
Post a Comment