హత్యకేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరారీలో ఉన్నారు. గతనెల 27వ తేదీ రాత్రి పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఉన్నం నరేంద్ర (35) దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి వర్గంలో కొనసాగుతున్న నరేంద్ర గతంలో టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ ఎమ్మెల్యే యరపతినేనికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. ఈయన హత్యపై అనుమానితులుగా భావిస్తున్న నలుగురిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఎమెల్యే ఎ-3 గా ఉన్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజు లుగా ఎమ్మెల్యే యరపతినేని టీడీపీ యాత్రలో ఎక్కువమంది కార్యకర్తల నడుమ ఉండటం వల్ల ఆయన్ను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. యాత్ర గురజాల నియోజకవర్గంలో మంగళవారం పూర్తికానుండటంతో మంగళవారం అరెస్ట్ చేయటానికి పోలీసులు సిద్ధమైన తరుణంలో ఎమ్మెల్యే గన్‌మన్లను వదలి పరారీలో ఉన్నారు.గురజాల డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు.
sakshi
sakshi
No comments:
Post a Comment