తెలంగాణపై తొలుత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పవలసి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వి. మైసూరా రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హొం మంత్రి మారినప్పుడల్లా అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. తెలంగాణ అంశంపై గతంలో అఖిలపక్ష సమావేశాలు రెండు సార్లు నిర్వహించారు. కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుండా ఇతరులను అభిప్రాయం చెప్పమనడం సరికాదన్నారు. తాము పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ జేఏసీ ప్రతినిధుల వినతిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ శనివారం వైఎస్ విజయమ్మను కలిశారు.
భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ చెప్పారన్నారు. 28న పార్టీలు చెప్పే అభిప్రాయాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ తెలిపారు. విజయమ్మను కలిసినవారిలో జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు.
sakshi

No comments:
Post a Comment