బి.కొత్తకోట: టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో అంటకాగుతూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చూడలేకే టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్యాకేజీలు తీసుకుని తమ పార్టీలో చేరుతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయమ్మ దీటుగా స్పందించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లినపుడు మీరెన్ని కోట్లు తీసుకున్నారని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చేసిందేమి లేదన్నారు. పాడి పరిశ్రమను నాశనం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
చిత్తూరు జిల్లాకే చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో సంక్షేమం కుంటుపడిందని అన్నారు. రైతులు పంట విరామం ప్రకటించే దుస్థితి దాపురించిందని తెలిపారు. జగన్ ను ఇబ్బందులు పాల్జేసేందుకే జైల్లో పెట్టారని ఆరోపించారు. వివాదస్పద 26 జీవోల వ్యవహారంలో మోపిదేవిని బలిపశువును చేసిన ప్రభుత్వం ధర్మాన ప్రసాదరావును కాపాడుతోందని తెలిపారు. జగన్ త్వరలోనే బయటికి వస్తారని, వైఎస్సార్ ప్రతి కలను నెరవేరుస్తారని విజయమ్మ చెప్పారు. తమ పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని, తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలను ఆమె అభినందించారు.

No comments:
Post a Comment