వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దానం సంచలన వ్యాఖ్యలతో విలేకరులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతుండగానే... తాను చెప్పేది నిజమంటూ మళ్లీ అదేమాట చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తన గుండెల్లో ఉన్నారని... ఆయన కొడుకైనా రోజూ స్మరించుకుంటాడో లేదో కానీ తాను, తన భార్య మాత్రం నిత్యం వైఎస్సార్‌ను తలచుకోకుండా ఉండమని తెలిపారు. నిత్యం వైఎస్సార్‌కు పూజలు చేస్తామని, దీపం వెలిగిస్తామని చెప్పారు. వైఎస్సార్ ఉంటే ఆ మనోధైర్యం వేరన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment