వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చట్టపరమైన(స్టాట్యుటరీ) బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఈ రోజు సిబిఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. వాన్ పిక్ కేసులో జగన్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో 7 అంశాలపై దర్యాప్తు పూర్తి అయిన తరువాతే బెయిలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పిందని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు. సిబిఐని పలు అంశాలపై కోర్టు ప్రశ్నించింది. జగన్ ను అరెస్ట్ చేసే ముందు అన్ని కేసులు, కస్టడీ గురించి చెప్పారా? అని కోర్టు అడిగింది. కొన్ని ప్రశ్నలకు న్యాయవాది సమాదానం చెప్పలేకపోయారు. ప్రస్తుతం ఆ వివరాలు తమ వద్ద లేవని చెప్పారు. దాంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. రేపు కూడా వాదనలు కొనసాగుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment