అల్లుడీమద్దెన
తన నిజాయితీ నిరూపించుకోటాన్కి తన మొ త్తం (అంటే బయటికి తెల్సిన) ఆస్తులన్ని అనౌన్స్‌మెంట్ జేసినా డు. ఇంత దైర్నంగా లెక్కల్తో సహా ఆస్తులు బయటికి జెప్పి నోడు ఈ రాష్ట్రంల మరోడు లేడ బ్బా అని పచ్చపారిటీ వోళ్లు పొగి డేసినారు. ఆ లెక్కలు జూసిన జెనానికి మాత్తరం మతులుబోయినాయి. సెంద్రబాబు ఆస్తులన్ని యెనక్కు నడుస్తున్నాయేటబ్బా... అందరికి ఎప్పుడోగొన్న ఇల్లు, బూవులు యేడాది యేడాదికి పెరగ తావుంటే ఈయనకు మాత్తరం తగ్గిపోయి అప్పులు మిగి ల్నాయంట అని అందరూ చెవులు గొరుక్కొనేసినారు. చెవు లు నెప్పట్టటంతో ఇంత అద్దాన్నం లెక్కల్ని ఆర్బిఐ గూడ తేల్చలేదని గమ్మునుండిపోయినారు.
ఇంతలో సెంద్రబాబు పాదయాతర మొదలుబెట్టేసి నాడు. యేకబిగిన మూడేల కిలోమీటర్లు దిరుగుతానని ప్రకటించి మరోపాల ఆంద్రరాష్ట్రాన్ని ఆచ్చర్యంల ముంచి నాడు. జనం కోసం అన్నం మానేసినానని జెప్పినోడు డ్రయిప్రూట్లతో యాల కిలోమీటర్లెట్టా దిరుగుతాడబ్బా అని అందరూ ముక్కుమీద యేలెట్టేసినారు. అయినా ఇందులో గూడా ఏదో కిటుకుంటాది. అదేందో దేల్చాలని కొందరు తసమదీయులు అతని పాదయాతరకు బోయినారు. అనౌన్స్‌మెంటయితే గొప్పగా జేసినాడుగానీ, నడవట మెట్లబ్బాయని సెంద్రబాబుక్కూడా దిగులుపట్టుకున్నది. ఆలోచించటం మొదలెట్టినాడు. యాలకోట్ల ఆస్తుల్ని లచ్చ ల్లో జూపించగాలేంది పారిటీ మడుసులు మద్దెన నడిచే ఈ నడకను మానేజ్ జెయ్యలేనా అని దైర్నం జెప్పుకున్నాడు.
మొదటిరోజు పగలంతా గది నుండి కదల్లా. పొద్దుగూకతానే బయటికొచ్చి మీడియాకోపాల ము కం జూపినాడు. తరువాత గుడికెల్లి టెంకాయగొట్టినాడు. గుడిముందు పోగైన జనాన్ని జూసి గంటసేపు వుపన్నాసం జెప్పినాడు. దాన్ల తను ముక్కెమంతిరిగా వున్నప్పుడు ఎన్నో గొప్ప పన్లు జేసినానని, ముక్కెంగా తనిచ్చిన ఆదాయం వల్లనే వైయ్య స్సారు మంచిపన్లు జేసినాడని, అయ్యన్నీ తన పతకాలేనని, కానీ అప్పుడు జెయ్యలేక చతికిలబడినానని, మరోపాల అది కారం ఇస్తే వైయ్యస్సుకంటె ఎక్కువ జేస్తానని వూదర గొట్టేసినాడు.
పన్లోపనిగా జగను బాబును కాసేపు దిట్టి తన ప్రసంగం ముగించినాడు. పచ్చచొక్కావోళ్లు తప్ప బయటి జనమెవ్వరూ చప్పట్లుకొట్టలే. ఆ బాదతో మరోపాల మైకు చేతిలోకి దీసుకోగానే ఇంక పాద యాతర మొదలుబెట్టమని తమ్ముల్లు ఎచ్చరిక జేయటంతో చేతిగ్గట్టిన వాచీ వంక ఓ పాలి బారుగా జూసినాడు. రాతిరి ఎనిమిది గంటలైనాది. గది నుండి బయటికొ చ్చింది మొదలు, గుడిల టెంకాయ గొట్టి జనానికి స్పీచిచ్చే వరకు 3 గంటలైనాదని లెక్కగట్టినాడు. 3 గంటలకు 20 కిలోమీటర్లు నడవొచ్చు గనుక ఆ లెక్కలన్ని తనతోపాటు ఐద్రాబాదు నుంచి దెచ్చిన ఆడిటరుకు ఇచ్చేసినాడు.
గనక మొదటి రోజు అల్లుడు గది నుండి గుడిదాకా 23 కిలోమీటర్లు నడిచేసినాడని అతని తోక పత్రికలు, చానల్లు వూదరబె ట్టేసినాయి. సెంద్రయాన మని పేరు బెట్టేసినాయి. ఆటయిములో ఆల్లకు అమాస సంగతి గుర్తురాలే. ఇంగ అసలు కస్టం రెండోరోజు మొదలైనాది. డబ్బులిచ్చి, చీపులిక్క రిచ్చి జనాన్ని దోలినాం గనక ఈ రోజు పూర్తిగా నడవాల్సిందే అని తమ్ముల్లు పట్టుబట్టటంతో తప్ప లేదు. తీరిగ్గా 11 గంటలకు బయటి కొచ్చి అందరికి ఒక దణ్ణం బెట్టేసి నాడు. ఆ వూర్ల గుడ్డలు నేసే వీవరాయనింటికి బోయి చేతిలవున్న మగ్గాన్ని గుంజుకున్నాడు. దాన్నాడిస్తూ ఆ మాటా ఈ మాటా జెబుతూ మూడు గంటలు గడిపేసి నా డు. బోజనాలకు టైమయినాదని అందరూ బూడ్సినారు.
సెంద్రబాబు బోజనవయ్యే సరికి రాత్రి 7 గంటలై నాది మల్లీ పాదయాతర మొదలుబెట్టి ఒకగంట నడ్సినాక గోలికాయలాడుకునే పిల్లలెదురైనారు. ఆల్లను గట్టిగా బట్టు కుని యాపసెట్టు కింద గూర్చోని నీతిపాటాలు సెప్పటం మొదలెట్టినాడు. అప్పటికి రాత్రి 10 గంటలైనాది. పిల్లకా యలు నిద్దరబోవటంతో ఆ ముచ్చట్లు ముగించి ఆరోజు టయిము ప్రకారం 24 కిలోమీటర్లు పాదయాతర జేసినా నని లెక్కలు జూపించి రూముకు బోయి తొంగున్నాడు.
మూడోరోజు పొలంల ఒక రయితును, నులక మంచ మ్మీద గూసున్న ముసలమ్మను, కుండలు జేస్కుంటున్న కుమ్మరాయన్ను గలిసి మాట్టాడేసరికి ఆ పొద్దు ముగి సింది. జగను బాబుకులా ఎగబడే జనం లేరుగనక తినే ఆల్ల దగ్గరకెల్లి పిల్లకాయల్నెత్తి ముద్దు బెట్టి చెయ్యిబట్టి షేక్ హాండ్లిచ్చి, ముగంలో నవ్వును జూపించుకుంటా ఇలా అల వాటు లేని సీన్లన్నిజేసి ప్రతిటయిమును కిలోమీటర్ల లెక్కన మార్చి గదికి పండబోయినాడు. అనంతపురం యాతర ముగిసే నాటికి తన నడక 350 కిలోమీటర్లని లెక్కలు జూపించినాడు. మద్దెలో ఎపెక్టు కోసవని కళ్లు దిరిగి పడిపోయినాడు గూడా. ఇలా సెంద్రబాబు పొలంలోకి ఎల్లింది, తిరిగి రోడ్డు మీదికొచ్చిందీ, బాయికాడకు బోయి అందుల నీల్లున్న య్యో లేయో జూసిందీ, పిడకలుగొట్టిన గోడ కాడికి బోయి పిడకలెన్నో లెక్కబెట్టిందీ ఇయ్యన్నీ అణా పైసల లెక్కన పాదయాతరల జమచేసి మొత్తం మూడేల కిలోమీటర్లు రాసుకోండని ఇలేకర్లకు లెక్కజెప్పినాడు.
అసలు పాయింటు మర్సినా. మద్దెమద్దెన ఎసి బస్సె క్కి దిగింది కూడా ఆ లెక్కల్లో జేరిపోయినాది. పాదయా తర్ల లెక్కలు గూడా బాగా మానేజ్ జేసినందుకు సెంద్ర బాబల్లుడు కుశాలైపోయి మరో మూడేల కిలోమీటర్లు యాతరజేస్తానని ప్రకటించేసినాడు.
ఆస్తుల లెక్కల మాదిరే పాదయాతర్ల లెక్కలున్నా యని అర్తమైన తసమదీయులు తిట్టుకుంటూ ఇండ్లకు పోయినారు. అసమదీయులు మాత్తరం ఈయన నడక ముందు వైయస్సు నడిచింది లెక్కేగాదనేసినారు. మిగిలిన జనం ఎందుకబ్బా ఈయనికీ పాదయాతరలు తొమ్మిదేళ్ల ముక్కెమంతిరి జేసింది జాలకా, ఈ వయస్సులో రామా, కృష్ణా అనుకుంటా ఇంట్లో గూకుంటే నీకూ మాకూ సుకంగా ఉంటాదిగా అని ముకం మీదే అనేసినారు.
డా. నందమూరి లక్ష్మీపార్వతి
No comments:
Post a Comment