మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం ముద్దలాపురం నుంచి ప్రారంభమై వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు, జల్లిపల్లి, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట వరకు సాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. గురువారం భంభంస్వామి గుట్ట వద్దే రాత్రి బస చేయనున్న షర్మిల 13 కిలోమీటర్ల మేర నడవనున్నారు. జల్లిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
రేపు షెక్షాన్‌పల్లిలో సభ
షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం భంభం స్వామి గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం మీదుగా సాగుతుంది. షెక్షాన్‌పల్లిలో బహిరంగ సభ ఉంటుంది. అనంతరం లత్తవరం సమీపంలో రాత్రి బస చేస్తారు. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు నడుస్తారని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

No comments:
Post a Comment