నేతన్నల సమస్యలు కళ్లారా చూశారు.. మహిళలతో మమేకమయ్యారు.. విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు.. వికలాంగుల భుజం తట్టి ధైర్యం చెప్పారు.. రైతన్నల కడగండ్లపై ఆవేదన చెందారు.. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మీ కష్టాలన్నింటినీ కడతేర్చే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల
అందరికీ భరోసా ఇచ్చారు.
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఎనిమిదో రోజు మంగళవారం రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. పాదయాత్రలో షర్మిలకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో ఎనిమిదో రోజు షర్మిల 12.9 కిలోమీటర్ల దూరం నడిచారు. సోమవారం రాత్రి అనంతపురం శివారులో బస చేసిన షర్మిల మంగళవారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. బస చేసిన గుడారం నుంచి షర్మిల కాలు బయటపెట్టేసరికే ఆ ప్రాంతంలో జనం కిక్కిరిసిపోయారు. చెరగని చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీకి చేరుకున్న షర్మిలకు ఆ కాలనీ మహిళలు అడుగడుగునా నీరాజనాలు పలికారు.
అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలు, కడగండ్లను కళ్లారా చూశారు. ‘పక్కనే పీఏబీఆర్ తాగునీటి పథకం పైపు మార్గం వెళ్తోన్నా మా కాలనీలో తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం తీవ్రమైన కష్టాలు పడుతున్నాం’ అంటూ ఆ కాలనీ మహిళలు షర్మి ల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు షర్మిల స్పంది స్తూ.. ‘జిల్లా ప్రజల దాహార్తి తీర్చడానికి దివంగత వైఎస్ పీఏబీఆర్‌కు పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. ఈ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కింది. రాప్తాడు బహిరంగ సభలో దివంగత సీఎం వైఎస్ మీ కాలనీకి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని రాజన్న రాజ్యంలో జగనన్న కార్యరూపం దాల్చేలా చూస్తారు. మీ తాగునీటి కష్టాలు తొలగిపోతాయి’ అంటూ భరోసా ఇచ్చారు.
నేతన్నలతో మమేకం..
పిల్లిగుండ్ల కాలనీ నుంచి సిండికేట్‌నగర్ కాలనీకి చేరుకున్న షర్మిలకు ఆ కాలనీ వాసులు ఆత్మీయ స్వాగతం పలికారు. కాలనీలో చౌడమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన షర్మిల అనంతరం రచ్చబండను నిర్వహించారు. ‘అమ్మా.. ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెబుతోంది. బ్యాంకోళ్లను అడిగితే అలాంటిదేమీ లేదంటున్నారు. రూ.2 నుంచి రూ.2.50 వడ్డీ వసూలు చేస్తున్నారు. వైఎస్ హయాంలో పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవారు.. అభయహస్తంతో ప్రతి ఒక్క మహిళకు పెన్షన్ ఇవ్వాలని వైఎస్ భావించారు. కానీ.. ఈ ప్రభుత్వం అభయహస్తాన్ని నిర్వీర్యం చేస్తోంది. జగనన్నను అకారణంగా జైల్లో పెట్టారు. నిజంగా వైఎస్ తప్పు చేసి ఉంటే మంత్రులు అందరూ తప్పు చేసినట్లే లెక్క. ఆ తప్పులకు మేం కూడా బాధ్యులమే. రఘువీరా వంటి మంత్రులు అంతా బాధ్యులే.
మా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కేవలం మాటలు తప్ప పనులేవీ చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో వీరందరికీ బుద్ధిచెబుతాం. వైఎస్సార్‌సీపీ తరఫున అనామకులను నిలబెట్టినా గెలిపిస్తాం’ అంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు శ్రీదేవి, ఉషారాణి తదితరులు సమస్యలను ఏకరువు పెట్టారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో జగనన్న మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలను మహిళలకు, పావలావడ్డీకే నేతన్నలకు రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ ప్రభుత్వం కాపీ కొట్టి ఇస్తామని చెప్పింది. కానీ.. ఆ ఉత్తర్వులు బ్యాంకర్లకు కూడా చేరలేదు. అభయహస్తాన్ని నిర్వీర్యం చేసింది.
మహిళలంటే ఈ ప్రభుత్వానికి ఎంత చులకనో దీన్ని బట్టే అర్థమవుతోంది. బాధపడొద్దు.. రాజన్న రాజ్యంలో మహిళలు అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ భరోసా ఇచ్చారు. ఆ కాలనీలో అత్యధికంగా చేనేత కుటుంబాలు నివసిస్తున్నందున కాలనీలోని చౌడన్న అనే నేత కార్మికుడి ఇంటికి వెళ్లిన షర్మిల.. కొంతసేపు మగ్గం నేశారు. చేనేత పరిస్థితి గురించి ఆరా తీశారు. ‘అమ్మా.. ముడిసరుకుల ధరలు పెరిగినాయి. మేం నేసే చీరలకు మాత్రం ధరలు పెరగలేదు. కనీసం కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇప్పుడు కరెంట్ కోతల వల్ల అసలు పనులే జరగడం లేదు. రెక్కాడితేగానీ డొక్కాడని మా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి’ అంటూ షర్మిలకు చౌడన్న నివేదించాడు.
చౌడన్న మేనకోడలు బాలచౌడమ్మ పడుకుని ఉండటాన్ని గమనించిన షర్మిల.. ‘అన్నా.. ఆ అమ్మాయికి ఏమైంది?’ అంటూ ఆరా తీశారు. ‘అమ్మా.. నా మేనకోడలికి 13 ఏళ్లు. బ్రెయిన్ ఇంప్రూవ్‌మెంట్ కాకపోవడం వల్ల అలా ఉంది. వైద్యం చేయించే స్థోమత లేక ఏమీ చేయలేకపోతున్నాం’ అంటూ బావురుమన్నాడు. ఇం దుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. బాధపడొద్దు.. జగనన్న ఉన్నారు’ అంటూ ధైర్యం చెప్పారు. ‘అన్నా.. కొద్ది రోజులు ఓపికపట్టండి. జగనన్న సీఎం అవుతారు. రాయితీపై ప్రభుత్వమే ముడిసరుకులు సరఫరా చేస్తుంది. మీరు నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తారు. రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా ఇస్తారు’ అంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వస్తోన్న షర్మిలకు చౌడన్న పట్టువస్త్రాలను బహూకరించి, ఇంటి ఆడబిడ్డలా ఆదరించారు. ఆ కాలనీలో వేలాది మహిళలు వీధుల్లోకి చేరుకుని షర్మిలపై బంతిపూల వర్షం కురిపించారు.
కొంద రు మహిళలు షర్మిలను ఆడబిడ్డలా భావించి.. పసుపు కుంకుమ, పట్టువస్త్రాలను సమర్పించి ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. మహిళలు తనను ఇంటి ఆడబిడ్డలా ఆదరిస్తోండటంతో షర్మిల ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. సిండికేట్‌నగర్ కాలనీ నుంచి రూట్స్ పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకున్న షర్మిల అక్కడ భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు రూట్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు. రాచానపల్లిలో మ హిళలు షర్మిలకు నీరాజనాలు పలికారు. అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి షర్మిలు నివాళులు అర్పించా రు. కొడిమి క్రాస్‌కు చేరుకున్న షర్మిలకు మహిళలు హారతి పట్టి.. గుమ్మడికాయతో దిష్టితీశారు.
ఉరవకొండ నియోజకవర్గ సరిహద్దులో ఘన స్వాగతం
సాయంత్రం ఐదు గంటలకు షర్మిల ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని లెప్రసీ కాలనీకి చేరుకున్నారు. అక్కడ ఆ కాలనీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మార్గమధ్యలో ఆర్వీఎం స్కూలు విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత గొట్కూర్ క్రాస్ మీదుగా బ్రాహ్మణపల్లి క్రాస్‌కు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడ షర్మిల రచ్చబండ నిర్వహించారు. ‘అమ్మా.. మా గ్రామంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. మా గ్రామం పక్కనే పీఏబీఆర్ నీటి పథకం పైపు లైను వెళ్తోంది.
ఆ పైపుల నుంచి నీళ్లు తీసుకుంటే పోలీసులు కేసులు పెడుతున్నారు. వైఎస్ ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడం వల్ల చదివించే స్థోమత లేక పిల్లలను చదువు మాన్పించాం’ అంటూ ఆ గ్రామ ప్రజలు బావురుమన్నారు. ‘అమ్మా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు. మీ తరఫున పోరాడుతోన్న జగనన్నపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారు. ఆయన ఎక్కడ ఉన్నా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ కష్టాలు తెలుసుకోవడానికి నన్ను మీ వద్దకు పంపారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి. రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెట్టుకుంటారు’ అంటూ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి రామచంద్రాపురం క్రాస్, కమ్మూరు క్రాస్ మీదుగా అగ్రిగోల్డ్ ఎస్టేట్‌కు రాత్రి 7.10 గంటలకు చేరుకున్న షర్మిల అక్కడే వేసిన గుడారంలో బస చేశారు.
source:sakshi

No comments:
Post a Comment