దేశ రాజకీయాలలో రిలయన్స్ సంస్థ పోషిస్తున్న వివాదాస్పద పాత్ర మరోసారి వెల్లడైంది.అవినీతి వ్యతిరేక పోరాట యోదుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. రిలయన్స్ సంస్థ ప్రభావం వల్లనే పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిని బదిలీచేసిందని కేజ్రీవాల్ యుపిఎ ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే కాంగ్రెస్ , బిజెపిలు రెండూ రిలయన్స్ జేబు సంస్థలేనని ఆయన చెప్పారు.గ్యాస్ ధరల పెంపు విషయంలో ఏర్పడిన విబేధాలవల్లే జైపాల్ ను బదిలీ చేశారని ఆయన స్పష్టం చేశారు.దేశంలోని ఆయా వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని తమకు అనుకూలమైన విధానాలు వచ్చేలా చేస్తున్నారన్నది ప్రధాన అభియోగం. ఇక్కడ మరో సంగతి ఎమిటంటే రిలయన్స్ సంస్థ రాజకీయపార్టీలనే కాక,కొన్ని మీడియా సంస్థలను తమ అదుపులో ఉంచుకోగలుగుతుంది.తద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకుంటోందన్న అభిప్రాయం ఉంది.
source:kommineni
source:kommineni





No comments:
Post a Comment