వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డకి వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్‌లు నీచరాజకీయాల చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం 15 రోజు పాదయాత్రలో షర్మిల మాట్లాడుతూ.. సీబీఐతో కలిసి జగనన్నను అక్రమంగా అరెస్ట్ చేయించాయి అని అన్నారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదనే ఈ కుట్రలు పన్నుతున్నారని ఆమె అరోపించారు.
ఎవరి కోసం జగన్ జైలు కెళ్లారని సీఎం కిరణ్ అనడాన్ని ఆమె తప్పు పట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, చేనేత కార్మికుల పక్షాన నిలిచి జగన్ పోరాడి దీక్షలు చేయలేదా అని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న పోరాటాలు చూసి కాంగ్రెస్, టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌లో ఉండి ఉంటే జగన్‌కు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఆజాదే చెప్పిన విషయాన్ని బట్టే కుట్ర బయటపడుతోందని అన్నారు.
వైఎస్‌ఆర్ కుమారుడిగా ప్రజాసమస్యలను.. తన సమస్యలుగా జగన్ మలుచుకున్నారని.. జగన్ ఏ తప్పూ చేయలేదని తాము ధైర్యంగా చెప్తున్నామని.. త్వరలోనే జగన్ బయటకు వస్తారని షర్మిల తెలిపారు. రాజన్న కన్న కలలను జగనన్న నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయ్యాక రైతులకు 3 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ పెడుతారని ఆమె తెలిపారు.

No comments:
Post a Comment