- జగన్‌పై మీ ఆరోపణలు నిజమని మీ బిడ్డల మీద ప్రమాణం చేస్తారా?
- ములాఖత్‌ల విషయంలో కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు
- బాబు యాత్ర ఉత్తరాంధ్రకు చేరేలోపు పార్టీ ఎమ్మెల్యేలంతా ఉడాయించడం ఖాయం
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. మొన్నటికి మొన్న జైలులో జగన్ ఫోన్లు మాట్లాడుతున్నాడంటూ అసత్య ఆరోపణలు చేశారని, దానిపై జగన్ సతీమణి భారతి చేసిన సవాలుకు మాత్రం నోరు మెదపలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలకు రాజకీయాల్లో విలువలుంటే గోబెల్స్ ప్రచారం మానుకొని.. బిడ్డల మీద ప్రమాణం చేయాలన్న భారతి సవాలును స్వీకరించాలన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గోబెల్స్ ప్రచారం చేయడంలో ఆరితేరిన చంద్రబాబు, ఆ పార్టీ నేతలు జగన్ ములాఖత్ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా ములాఖత్ ద్వారా కలిసే ప్రతి ఒక్కరి పేరు రికార్డులో నమోదు చేస్తారన్న కనీస ఇంగితజ్ఞానం టీడీపీ నేతలకు లేదా?’’ అని దుయ్యబట్టారు. టీడీపీ నేతలకు జగన్‌పై ఉన్నంత ధ్యాస ప్రజా సమస్యలపై ఉండుంటే రాష్ట్రం ఈ దుస్థితికి వచ్చేది కాదన్నారు.
మీ మాటలకు నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి..
‘‘రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికి తగ్గించానని, పావలా వడ్డీని రద్దుచేసి ఉచితంగా రుణాలు ఇస్తున్నామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటున్న తీరు చూసి ప్రజలు నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. వైఎస్ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఏ ఒక్కదానిలోనూ ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఐదేళ్లు పాలించారు.
కిరణ్ మాత్రం ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు మోపుతూ వారి నడ్డివిరుస్తున్న మాట వాస్తవం కాదా?’’ అని జూపూడి నిలదీశారు. తొమ్మిదేళ్ల పాలనలో రైతులను వీధుల్లో పడేలా చేసింది చంద్రబాబేనని, అలాంటి వ్యక్తి ఇప్పుడు చెప్పే హామీలను ప్రజలు నమ్మడంలేదన్నారు. ఆయన పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునేలోపు పార్టీ ఎమ్మెల్యేలందరూ ఉడాయించడం ఖాయమని జోస్యం చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు చంద్రబాబు చేత పాదయాత్రను విరమింపజేసేందుకు కాళ్లనొప్పి, నడుంనొప్పి అంటూ సాకులు చెప్తున్నారన్నారు.

No comments:
Post a Comment