ఏలూరు, న్యూస్‌లైన్: ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీ నామా చేశానని నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఏలూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ పేదల కోసం జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ తనయుడు జగన్ నడుస్తూ పేద ప్రజలకు అండగా నిలవడం తనను ఆకర్షించిందని చెప్పారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారని, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని ఏర్పాటుచేసి అంతకు మించిన మరో రాజకీయ విప్లవాన్ని తీసుకువచ్చారని అన్నారు.
source:sakshi
No comments:
Post a Comment