షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర చరిత్రాత్మకమని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మళ్లీ సీఎం కావాలని మోసపూరిత పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును చూసి ప్రజలు పరుగులు పెడుతుంటే.. షర్మిల యాత్రను చూసి వెంట అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. మంగళవారం సాయంత్రం ఆమె బెంగళూరు వెళుతూ మార్గమధ్యలోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఏపీ టూరిజం రెస్టారెంటులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు పాదయాత్రలు సాగుతున్నాయని, వీటిలో నిజమైన యాత్ర షర్మిలదేనని అన్నారు. చంద్రబాబు చేస్తున్నది మోసపూరిత యాత్ర అని దుయ్యబట్టారు. గతంలో మహానేత వైఎస్ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వారి కష్టాలన్నీ తీర్చారన్నారు.
ఎన్‌టీఆర్ పుణ్యమా అని నాలుగేళ్లు, వాజ్‌పేయి పుణ్యమా అని నాలుగున్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలను కష్టాలపాలు చేశారని విమర్శించారు. ఎన్‌టీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారన్నారు. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రంలో వ్యవసాయం తుడిచి పెట్టుకుపోయేలా చేశారన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏపనైనా చేస్తారన్నారు.
దేశంలో బాబును మించిన అవినీతి పరుడు లేరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి విదేశాల్లో సైతం ఆస్తులు కూడగట్టారన్నారు. అటువంటి బాబు ఏ నైతిక హక్కుతో పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భౌతికంగా బంధించినా... ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమన్నారు.
source:sakshi

No comments:
Post a Comment