జడివానతో జనం పోటీపడ్డారు. జల్లులు కురుస్తున్నా చెక్కుచెదరని అభిమానానికి రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి షర్మిల తడిసిముద్దయ్యారు. ఆత్మీయ పలకరింపులు.. అధైర్య పడొద్దంటూ ఓదార్పు.. భవిష్యత్‌పై భరోసా ఇవ్వడంతో జనాభిమానం ఉప్పొంగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రి కమ్మూరుకు సమీపంలో అగ్రిగోల్డ్ ఎస్టేట్ వద్ద బస చేసిన షర్మిల బుధవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు.
గుడారం నుంచి షర్మిల అడుగు బయట పెట్టగానే అప్పటిదాకా మేఘావృతమై ఉన్న ఆకాశం నుంచి వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఆ చినుకులతో జనం కూడా పోటీపడ్డారు. షర్మిల గుడారం నుంచి బయటకు వచ్చే సరికే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జడివానలోనూ జనం చెక్కుచెదరక పోవడంతో షర్మిల కదనోత్సాహంతో అడుగులు ముందుకేశారు. పాదయాత్ర అరవకూరుకు చేరుకోవడానికి ముందు వేరుశనగ పొలంలోకి షర్మిల వెళ్లి.. రైతు నారాయణతో పంట పరిస్థితిపై ఆరా తీశారు.
‘అన్నా.. ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంట వేశావు.. పంట దిగుబడి ఏ మేరకు వస్తుంది’ అంటూ ఆరా తీశారు. ఇందుకు నారాయణ స్పందిస్తూ.. ‘అమ్మా.. వర్షాల్లేక పంటలు ఎండిపోతున్నాయి. మహానేత వైఎస్ ఉన్నప్పుడు పంటల బీమా పథకం వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం అందేది. కానీ.. ఇప్పుడు వాతావారణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రీమియం కింద రూ.300 మేం చెల్లిస్తుంటే.. బీమా సంస్థ రూ.200ను పరిహారంగా ఇస్తోంది. మేం ఎకరం వేరుశనగ సాగు చేయడానికి రూ.పది వేలు ఖర్చవుతోంది.
బ్యాంకుల్లో పెళ్లాం మెడలో తాళిబొట్టును కూడా కుదువపెట్టి రుణం తెచ్చి పంటలు సాగు చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు’ అంటూ వాపోయారు. ‘అన్నా.. ఈ ప్రభుత్వానికి రైతులంటే చులకన.. చంద్రబాబు ప్రభుత్వం మాదిరే ఈ సర్కారు కూడా.. ఆందోళన చెందవద్దు.. రాజన్న రాజ్యం వస్తుంది. మళ్లీ రైతే రాజు అవుతారు’ అంటూ షర్మిల భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి అరవకూరుకు చేరుకున్న షర్మిలకు.. ఆ గ్రామ శివారులో మహిళలు హారతులు పట్టి.. దిష్టి తీసి ఘనస్వాగతం పలికారు. అరవకూరులో షర్మిల నడిచినంత దూరం ఆమెపై బంతిపూల వర్షం కురిపించారు.
ఇదెక్కడి చోద్యం..
అరవకూరులో షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన చిదంబరమ్మ అనే మహిళ ‘అమ్మా.. పీఏబీఆర్ డ్యాం పక్కనే ఉంది. వైఎస్ హయాంలో మా ఊరి చెరువుకు నీళ్లిచ్చినారు. పంటలు బాగా పండించుకున్నాం. రెండేళ్లుగా చెరువుకు నీళ్లు ఇవ్వడం లేదు. బోర్లు అన్నీ ఎండిపోయినాయి. తాగడానికే గుక్కెడు నీళ్లు లేవు. ఇంక పంటలేం పండించుకుంటాం.. ఏం తిని బతుకుతాం’ అంటూ షర్మిల ముందు విలపించింది. సుశీలమ్మ అనే మరో మహిళ మాట్లాడుతూ ‘సేద్యానికి కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వడం లేదు. వేళాపాళా లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నారు. పంటల కథ దేవుడెరుగు.. కనీసం పశువులకు మేత కూడా లేదు.. ఎలా బతికేది’ అంటూ షర్మిల ముందు వాపోయారు.
ఇంతలోనే మరో మహిళ మాట్లాడుతూ ‘అమ్మా.. మా గ్రామానికి ఆమ్‌ఆద్మీ బీమా లేదు.. అభయహస్తం పెన్షన్‌లు లేవు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అన్నీ సమస్యలే. ఈ ప్రభుత్వం చంద్రబాబు పాలనను తలపిస్తోంది. వైఎస్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు’ అంటూ షర్మిలకు వివరించారు.
జయపురం గ్రామానికి చెందిన ఓ ఎస్సీ విద్యార్థిని మాట్లాడుతూ ‘ఫీజులు కట్టే స్థోమత లేక చదవు మానేశా. వైఎస్ ఉండి ఉంటే ఫీజు కట్టేవారు.. నేను చదువుకుని.. మంచి ఉద్యోగం చేసి, మా అమ్మానాన్నలను బాగా చూసుకునేదాన్ని’ అంటూ విలపించింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘పీఏబీఆర్‌కు వైఎస్ పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. వైఎస్ తన హయాంలో ఏటా నీటిని విడుదల చేయించారు.
అందుకే అప్పుడు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు.. కానీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేయించడం లేదు. అందుకే ఈ నీటి కష్టాలు.. వైఎస్ చేపట్టిన ప్రతి పథకాన్ని ఈ ప్రభుత్వం నీరుగార్చుతోంది. చంద్రబాబు పాలనను ఈ ప్రభుత్వం తలపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ రెండూ రెండే.. కొద్ది రోజులు ఓపికపట్టండి.. రాజన్న రాజ్యంలో అందరికీ మేలు చేసే పాలన వస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు.
కుర్చీ కోసమే కాంగ్రెస్, టీడీపీ ఆరాటం..
కూడేరులో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ‘జనం సమస్యలతో తల్లడిల్లుతుంటే పాలక కాంగ్రెస్ పార్టీ కుర్చీలాట ఆడుతోంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన టీడీపీ అధినేత పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. చంద్రబాబు హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే.. ఇప్పుడు పాదయాత్రలో గ్రామాల్లో ప్రజల కాళ్లు, చేతులు పట్టుకున్నా చంద్రబాబు చేసిన పాపం పోదు.. కుర్చీ కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారు.. కుమ్మక్కు రాజకీయాలతో ప్రజాకంఠక పాలన సాగిస్తోన్న కాంగ్రెస్‌కూ.. ఆ పార్టీతో కుమ్మక్కైన టీడీపీకి బుద్ధి చెప్పండి.. విశ్వసనీయత, మాట మీద నిలబడే నైజం ఉన్న జగనన్నను ఆశీర్వదించండి. రాజన్న రాజ్యం వస్తుంది.
వైఎస్ ఇచ్చిన ప్రతి మాటనూ జగనన్న నెరవేర్చుతారు’ అంటూ భరోసా ఇచ్చారు. ఇక్కడే ఓ అబ్బాయికి రాజశేఖర్ అని షర్మిల నామకరణం చేశారు. కూడేరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్దకు రాత్రి 7.10 గంటలకు చేరుకున్న షర్మిల పాదయాత్రను ముగించి.. అక్కడే బసచేశారు. బుధవారం 12 కిలోమీటర్ల మేర నడిచారు.
సేద్యానికి ఉచిత విద్యుత్ ఎక్కడ?
అరవకూరు నుంచి కూడేరుకు చేరుకునే క్రమంలో మార్గమధ్యలో 12.40 గంటలకు భోజనం చేసిన షర్మిల, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. అదే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న చీనీ తోటలోకి వెళ్లారు. రైతు గాంగేనాయక్‌ను పంట పరిస్థితిపై ఆరాతీశారు. ‘అమ్మా.. కరెంట్ కోతల వల్ల చీనీ చెట్లకు సరిగ్గా నీళ్లు పెట్టలేకపోతున్నా. సేద్యానికి ఉచిత విద్యుత్ అంటోన్న ప్రభుత్వం మరో వైపు రూ.20 వేల బిల్లు కట్టాలని నోటీసులు ఇచ్చింది. తక్షణమే రూ.20 వేలు కట్టాలని అధికారులు వేధిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అధికారులు వచ్చి నన్ను వేధించారు’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఇదీ ఈ సర్కారు పనితీరు. ఉచిత విద్యుత్ అంటూ ఈ ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తోంది.
బిల్లులు కడతావా విద్యుత్ తీగలను కత్తిరించాలా అని వేధిస్తుంటే రైతులు ఎలా కట్టగలరు.. చంద్రబాబు హయాంలో ఇలా చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నా.. అధైర్యపడొద్దు.. మన రాజన్న రాజ్యం వస్తుంది.. సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తుంది’ అంటూ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి కూడేరుకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి మహానేత వైఎస్ సర్కిల్‌కు చేరుకునే వరకూ షర్మిలపై బంతిపూల వర్షం కురిపించి.. అభిమానాన్ని చాటుకున్నారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యం చేసి.. షర్మిలకు ఘన స్వాగతం పలికారు.
కూడేరు జనమేరు అయినవేళ..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో తొమ్మిదో రోజూ షర్మిలకు నీరాజనాలు పలికిన జనం
వర్షంలోనూ షర్మిల అడుగులో అడుగేస్తూ కదం తొక్కిన జనం
వాతావరణ బీమా పేరుతో వేరుశనగ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ షర్మిలకు
నివేదించిన రైతులు
పీఏబీఆర్ పక్కనే ఉన్నా చెరువులకు నీళ్లు లేవు.. పశువులకు మేత లేదని.. బతుకు భారమైందని విలపించిన జనం
సేద్యానికి ఉచిత కరెంట్ అంటూనే వేలకు వేలు బిల్లులు కట్టాలంటూ అధికారులు
వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
కొద్ది రోజులు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. అందరికీ మేలు జరుగుతుందని
భరోసా ఇచ్చిన షర్మిల

No comments:
Post a Comment