ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందంటూ కిరణ్ సర్కార్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం తాగునీరు కూడా ఇవ్వలేక చేతులెత్తేసిందని ఆమె మండిపడ్డారు. అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కిరణ్ సర్కారును నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా వారితో కుమ్మక్కై పట్టనట్టు కూర్చుందని షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గంలోని పిల్లిగుండ్ల కాలనీ, నీనం రాజశేఖర్‌రెడ్డి నగర్‌కు చేరుకుంది.
No comments:
Post a Comment