పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆదివారం జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సభ రద్దయింది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేసినట్లు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ టి.బాలరాజు, పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు), గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే టి.వనితతో పాటు పలువురు నేతలు ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తొలుత భావించారు. సభ రద్దవడంతో అనుకున్న ముహూర్తానికే ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాలని వారు నిర్ణయించారు. కృష్ణబాబు శనివారం రాజమండ్రిలోని తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమై ఆదివారం జరగాల్సిన కార్యక్రమంపై చర్చించారు.
ఆదివారం ఉదయం 9 గంటలకు ఏలూరులో బయల్దేరి, సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవాలని నిర్ణయించారు. కృష్ణబాబు, ఎమ్మెల్యే టి.వనితతో పాటు మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పోలిపర్తి సత్యవతి, మున్సిపల్ వైస్‌చైర్మన్ బొబ్బా సుబ్బారావులతోపాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు విజయమ్మ సమక్షంలోపార్టీలో చేరతారని బాలరాజు ప్రకటించారు.
source:sakshi

No comments:
Post a Comment