విద్యుత్ సర్‌ఛార్జీల పేరుతో మూడేళ్ల నుంచి ఈ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ విమర్శించారు. వైఎస్‌ఆర్ తన హయంలో ఏరోజూ ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ మరణాంతరం సీఎం పీఠమెక్కిన రోశయ్య, కిరణ్ ఛార్జీల మోత మోగిస్తున్నారని ఎద్దేశా చేశారు. సర్దుబాటు ఛార్జీలు పెంచాలన్న నిర్ణయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు.
ఈ అసమర్థ ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారని, అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఢిల్లీ వెళ్లినట్లు ఓ దినపత్రిక గాలివార్తలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ తప్పుడు కథనాలేనని జనక్ ప్రసాద్ కొట్టిపారేశారు.
source:
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480407&Categoryid=14&subcatid=0

No comments:
Post a Comment