ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు తనయుడు చిట్టూరి నరేంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీగౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో అభిమానులతో కలిసి చేరతానని శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, తనతండ్రి బాపినీడు చేసిన సేవలు కొనసాగించేందుకు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు నరేంద్ర వివరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరొందిన నరేంద్ర చేరికతో పార్టీ మరింత బలపడుతుందని పార్టీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480421&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480421&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment