మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం భంభం బాబా గుట్ట నుంచి ప్రారంభమై పెన్నహోబిలం, పీఏబీఆర్ కాలువ, కోనాపురం క్రాస్, కోనాపురం, షెక్షాన్‌పల్లి, లత్తవరం సరిహద్దు వరకు సాగుతుంది. షెక్షాన్‌పల్లి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం లత్తవరం సరిహద్దులో ఏర్పాటు చేసిన గుడారంలో రాత్రి బస చేస్తారు. 12.5 కిలోమీటర్లు నడుస్తారని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.
రేపు ఉరవకొండలో..
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం లత్తవరం సరిహద్దు నుంచి బయలుదేరి ఉరవకొండ పట్టణంలో సాగుతుంది. షర్మిల ఉరవకొండ పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం మార్కెట్ యార్డు వద్ద రాత్రి బస చేస్తారు.

No comments:
Post a Comment