జననేత వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం ఉరవకొండ మార్కె ట్ యార్డు నుంచి ప్రారంభమై గాలిమరల సర్కిల్, వజ్రకరూరు మండలంలోని పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హం ద్రీ-నీవా కాలువ మీదుగా రాగులపాడు వరకు సాగుతుంది. రాగులపాడులో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం 12.5 కిలోమీటర్లు నడుస్తారని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రేపు వజ్రకరూరులో బహిరంగ సభ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర సోమవారం రాగులపాడు నుంచి పందికుంట, తట్రకల్లు, గంజికుంట మీదుగా వజ్రకరూరు వరకు సాగుతుంది. వజ్రకరూరులోని గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. |
source:sakshi
No comments:
Post a Comment