అనంతపురం:మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం నగర శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ నుంచి పిల్లిగుండ్ల కాలనీ, నీలం రాజశేఖరరెడ్డి నగర్, సిండికేట్‌నగర్ కాలనీ, రూట్స్ పబ్లిక్ స్కూల్, రాచానపల్లి, లెప్రసీ కాలనీ, గొట్కూర్ క్రాస్, బ్రాహ్మణపల్లి క్రాస్ మీదుగా కమ్మూరు క్రాస్ వరకు సాగనుంది. సోమవారం 11.2 కిలోమీటర్ల దూరం నడిచిన షర్మిల.. మంగళవారం 12.9 కిలోమీటర్ల దూరం నడవనున్నారని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment