తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని టిడిపినుంచి సస్పెండైన నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు టీడీపీ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమనేది రామకోటయ్య వాదన. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదని అందుకే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నట్టు రామకోటయ్య అంటున్నారు.
పార్టీలో కొనసాగుతున్న పరిణామాలపై గతంలోనే అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకూ తన ఫిర్యాదులకు ఎలాంటి వివరణా రాకపోవడం బాధాకరమని ఆయన అంటున్నారు. రామకోటయ్యను అనర్హుడిగా ప్రకటించాలని టిడిపి...స్పీకర్‌ను కోరనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటినికూడా పరిగణలోకి తీసుకున్న రామకోటయ్య నాకు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం కల్పించండంటూ ఎలక్షన్ కమిషన్‌కు రాసిన లేఖలో అభ్యర్థించారు

No comments:
Post a Comment