అనంతలో టీడీపీకి షాక్: భారీగా వైస్సార్సీపీలోకి నేతలు
అనంతపురం, న్యూస్‌లైన్: ‘ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఉన్న తాను ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది’అని అనంతపురంలో సోమవారం షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, శింగనమల మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసిన తరిమెల. తో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారికి పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తరిమెల మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే సత్తా కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇదే సభలో పుట్టపర్తి నియోజకవర్గం నాయకుడు డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తచెరువు మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యులు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, నగరానికి చెందిన టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పి.నూర్‌జాన్, మరికొందరు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సభలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment